News July 3, 2024

18,526 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

image

AP: కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరకు పట్టుకున్న 15,396 టన్నుల(రూ.43.43 కోట్ల) రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనం. కాగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ మాఫియా అవినీతికి పాల్పడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News September 20, 2024

కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: జగన్

image

AP: చంద్రబాబు అనే వ్యక్తి దుర్మార్గుడని YS జగన్ ధ్వజమెత్తారు. ‘దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగాలనే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. 100 రోజుల చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారమంతా ఓ కట్టు కథ. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు’ అని జగన్ మండిపడ్డారు.

News September 20, 2024

తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడాలి: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల ఆలయ ప్రతిష్ఠను భక్తులు, ప్రజలు కాపాడాలని టీటీడీ ఈఓ శ్యామలరావు కోరారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ఈఓ స్పందించారు. ‘రికార్డుల్లో లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని ఉంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చింది. వాటితోనే నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 20, 2024

జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: టీటీడీ ఈవో

image

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి AR డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని TTD EO శ్యామలరావు ప్రకటించారు. నెయ్యిపై అనుమానంతో జులై 6న 2 ట్యాంకర్లను ల్యాబ్‌కు పంపితే నాణ్యత లేదని తేలిందన్నారు. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. వెంటనే AR డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశామన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు.