News July 3, 2024

ఇసుక విధానం అమలుపై కీలక సమావేశం

image

AP: నూతన ఇసుక పాలసీపై అధికారులతో CM చంద్రబాబు కూలంకషంగా చర్చించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. కాగా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే ఆన్‌లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందిస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 7, 2026

సంచలనం.. చేతులు కలిపిన బీజేపీ-కాంగ్రెస్

image

ప్రధాన ప్రత్యర్థులైన BJP-INC ఓ స్థానిక ఎన్నిక కోసం చేతులు కలపడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలో ఈ విచిత్రం జరిగింది. అక్కడ 60స్థానాలకుగాను శివసేన(షిండే) 27 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి మ్యాజిక్ ఫిగర్‌కు 4సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో BJP(14), INC(12), అజిత్ NCP(4), ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో BJP అభ్యర్థి తేజశ్రీ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు.

News January 7, 2026

ట్రంప్ నోటి దురుసు.. ప్రభుత్వ మౌనంపై ప్రతిపక్షాల మండిపాటు!

image

‘భారత్ నన్ను సంతోషపెట్టాలి. అందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. నేను విధించిన టారిఫ్స్ వల్ల మోదీ అసంతృప్తిగా ఉన్నారు’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిపై భారత ప్రభుత్వం మౌనం వహించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ‘ఎందుకు భయపడుతున్నారు? దేశ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా?’ అని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో విమర్శల వేడి పెరుగుతోంది.

News January 7, 2026

ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

image

TG: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.