News July 3, 2024

ఆ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: MP అరవింద్

image

ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట దుర్ఘటన పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.

Similar News

News July 8, 2024

KMR: రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు అవకాశం

image

రేషన్ కార్డుల్లో చిరునామా మార్పులు, కొత్త సభ్యుల పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మీ సేవ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News July 8, 2024

నిజామాబాద్​ జిల్లాలో డేంజర్​ బెల్స్

image

NZB​ జిల్లాలో డెంగ్యూ డేంజర్​ బెల్స్​ మోగిస్తోంది. గత 6 నెలల నుంచి 134 కేసులు నమోదవ్వగా కేవలం జూన్‌లోనే మెడికల్​ ఆఫీసర్లు 9 కేసులు గుర్తించారు. వైరల్ ఫీవర్, డయేరియా, టైఫాయిడ్​ వ్యాధులు ప్రజలను కుదిపేస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో జూన్​ నుంచి డయేరియా 263,37, టైఫాయిడ్​, 467 వైరల్​ ఫీవర్​ కేసులను గుర్తించి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. దీంతో అంగన్​వాడీ, ఆశావర్కర్లను స్థానిక అధికారులను అలర్ట్ చేసింది.

News July 8, 2024

NZB: కనిపించిన నెలవంక.. మొహర్రం ప్రారంభం

image

ఆదివారం రాత్రి నెల వంక దర్శనమివ్వడంతో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తు. దీన్నే మొహర్రం అని పరిగణిస్తారు. ఈ మాసంలో పీర్ల పండుగ కూడా ప్రారంభమవుతుంది. నెల వంక స్పష్టంగా కనిపించిన ఐదో రోజు పీర్లను ప్రతిష్ఠిస్తారు. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో 10 రోజులు మాత్రమే పీర్ల పండగను జరుపుకోగా, కామారెడ్డి జిల్లా పిట్లంలో 20 రోజుల పాటు జరుపుకుంటారు.