News July 3, 2024

ఖాజీపేట హై‌స్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సస్పెండ్

image

ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్‌ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.

Similar News

News July 8, 2024

YSRకు మాజీ సీఎం జగన్ నివాళి

image

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద తన తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట మాజీ ఎమ్మెల్యేలు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News July 8, 2024

రాయచోటిలో వ్యక్తి దారుణ హత్య

image

రాయచోటిలో ఆదివారం దారుణ హత్య జరిగింది. రాయచోటి మసీదు వీధికి చెందిన ఇర్షాద్ అలీ రెడ్డిబాషా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె సోదరుడు ఇబ్రహీం(22) తరచూ మద్యం తాగి సోదరి ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో విసుగుచెందిన ఇర్షాద్ బావమరిదిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మద్యం తాగుదామని చెప్పి గున్నికుంట్లకు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి బీరుసీసాతో గొంతు కోసి హత్య చేశాడు.

News July 8, 2024

ప్రతీ కార్యకర్తకు వైసీపీ తోడుగా ఉంటుంది: YS జగన్

image

పులివెందుల: రాబోయే కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు.