News July 3, 2024

WGL: వాట్సాప్ నుంచే ఫిర్యాదు చేయొచ్చు: సీపీ

image

కొత్త చట్టాలపై WGL సీపీ అంబర్ కిషోర్ ఝూ కీలక అంశాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నూతన చట్టంలో మహిళలు, బాలలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. బాధితులు చేసిన ఫిర్యాదుల వివరాలను ఆన్‌లైన్లో పరిశీలించుకోవచ్చని తెలిపారు. బాధితులు అత్యవసరంగా సంబంధిత ఠాణా నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, విచారించిన తర్వాత కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Similar News

News July 8, 2024

BREAKING.. వరంగల్: మాజీ సర్పంచ్ దారుణ హత్య

image

మాజీ సర్పంచ్ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. రాయపర్తి మండలం బురాన్‌పల్లి మాజీ సర్పంచ్ దేవేందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. దేవందర్ ఇంట్లో ఉన్న క్రమంలోనే హత్య చేశారు. కాగా, భూ తగాదాల విషయంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

SI మృతికి ప్రభుత్వానిదే బాధ్యత: మాజీ MLA

image

పురుగు మందు తాగి భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులతోనే SI శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. NSPTలో ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, SI మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News July 8, 2024

నేడు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

నేడు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాలని కోరారు.