News July 3, 2024

ఉమ్మడి జిల్లాలో 244 కళాశాలలు.. ఇద్దరే పీడీలు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 81 ఉన్నాయి. వీటిలో 40,746 మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలలు 163 ఉన్నాయి. వీటిలో 29,297 మంది చదువుతున్నారు. మొత్తం 70వేల మందికి ఇద్దరే ఫిజికల్ డైరెక్టర్లు (వ్యాయామ అధ్యాపకులు) ఉన్నారు. ఒకరు జడ్చర్ల ప్రభుత్వ కళాశాలలో, మరొకరు ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నారు. PDలు లేకపోవడంతో క్రీడ రంగంలో విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారు.

Similar News

News July 8, 2024

మహబూబ్‌నగర్: నేటి నుంచి మొహర్రం

image

హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా ప్రతీక అయిన మొహర్రంను సోమవారం నుంచి జరుపుకోనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పీర్ల ఊరేగింపు చాలా ప్రత్యేకత ఉంది. జిల్లాలో పది రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడ ప్రజలు గ్రామ గ్రామాన జరుపుకుంటారు. నారాయణపేట జిల్లా కోయిలకొండ బీబీ ఫాతిమా సవారి తర్వాత ఊట్కూర్ మండల కేంద్రంలోని హసన్, హుస్సేన్ సవారీలు వైభవంగా జరుగుతాయి.

News July 8, 2024

MBNR: 14న జగన్నాథ రథయాత్ర మహోత్సవం

image

శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవం పాలమూరులో ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ఎం.యాదిరెడ్డి, రాజమల్లేశ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు పాలమూరు భక్త బృందం ఆధ్వర్యంలో కీర్తనలు, నృత్యాలు, భజనలు, కోలాటాలతో పరమాద్భుతమైన ఉత్సవంగా జరగనుందని చెప్పారు.

News July 8, 2024

కృష్ణ జింకలకు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు

image

కృష్ణా నదీతీర ప్రాంతాల్లోని రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. వందలాది కృష్ణ జింకలు పంట పొలాల్లోకి ప్రవేశించి, రైతులు విత్తిన విత్తనాలతోపాటు మొలకెత్తిన మొక్కలను తినేస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కృష్ణా మండలం ముడుమాల్ సమీపంలో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.2.70 కోట్లు మంజూరు చేస్తూ, పరిపాలన అనుమతులు ఇచ్చింది.