News July 3, 2024
ఇవాళ హాల్‌టికెట్లు విడుదల

TG: ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పీజీ ఎంట్రన్స్ టెస్ట్ హాల్‌టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. 8 వర్సిటీల్లోని 45 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలకు 73,566 మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 15 వరకు పరీక్షలు జరగనున్నాయి. అటు ఇతర పరీక్షల కారణంగా ఈ నెల 7న జరగాల్సిన ఎంఈడీ పరీక్షను 16వ తేదీకి వాయిదా వేశారు. cpget.tsche.ac.in వెబ్సైటు నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు.
Similar News
News December 29, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ గడ్డి పెంపకం

చాలా మంది రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని జీవాలకు ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పశువుల్లో పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం’ అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది.
News December 29, 2025
ఇవాళ అసెంబ్లీలో..

TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కాసేపట్లో మొదలు కానున్నాయి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. అనంతరం సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయమై BAC నిర్ణయం తీసుకోనుంది. JAN 2న కృష్ణా, 3న గోదావరి బేసిన్ జలాలపై చర్చ జరగనుంది. కాగా 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని BRS పట్టుబడుతోంది.
News December 29, 2025
యుద్ధ మేఘాలు: US-తైవాన్ డీల్‌కు కౌంటర్‌గా చైనా సైనిక విన్యాసాలు

చైనా సైన్యం తైవాన్ చుట్టూ ‘జస్టిస్ మిషన్ 2025’ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టింది. తైవాన్ పోర్టులను దిగ్బంధించి పట్టు నిరూపించుకోవాలని చూస్తోంది. తైవాన్ స్వాతంత్ర్య కాంక్షకు ఇదొక హెచ్చరిక అని చెబుతోంది. తైవాన్‌తో $11 బిలియన్ల ఆయుధ డీల్‌కు US ఓకే చెప్పిన 11 రోజులకే చైనా ఈ స్టెప్ తీసుకుంది. దీనికి కౌంటర్‌గా తైవాన్ రెస్పాన్స్ సెంటర్ ఏర్పాటు చేసి తన సైన్యాన్ని అలర్ట్ చేసింది.


