News July 3, 2024

టెస్లాతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు

image

AP: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లాతో పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం గురించి వివరిస్తున్నారు. 2019కి ముందు వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి? మిగతా వాటి పరిస్థితి ఏంటన్న దాన్ని విశ్లేషిస్తున్నారు.

Similar News

News July 8, 2024

అమానవీయం: ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని..

image

AP: బాపట్ల(D) చీరాల మం. కొత్తపాలెంకు చెందిన మణికంఠ రెడ్డి, కుసుమాంజలి 2021లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 20 రోజుల క్రితం భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న కుసుమాంజలి వారం క్రితం ప్రసవించింది. అప్పటికే ఓ ఆడబిడ్డ ఉండగా రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో అత్తింటివారు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో కుసుమాంజలి పోలీసులను ఆశ్రయించింది.

News July 8, 2024

శాంసంగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్ట్రైక్

image

సౌత్ కొరియాలోని శాంసంగ్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఆ కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద స్ట్రైక్‌కు తెరతీశారు. యాజమాన్యంతో చర్చలు విఫలమవడంతో దాదాపు 6,500 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి 3 రోజుల సమ్మెకు దిగారు. కంపెనీకి వచ్చే అదనపు లాభాల్లో నుంచి తమకు రావాల్సిన బోనస్‌, ఏడాదికి ఒకరోజు అదనపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్ట్రైక్‌పై శాంసంగ్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది.

News July 8, 2024

టాలీవుడ్ వల్లే స్టార్‌నయ్యా: కమల్

image

తెలుగు సినీ ఇండస్ట్రీనే తనను స్టార్‌ని చేసిందని కమల్ హాసన్ అన్నారు. మరో చరిత్ర, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి అద్భుత విజయాలు ఇక్కడే దక్కాయని గుర్తు చేసుకున్నారు. 1996లో ‘భారతీయుడు’కు వసూళ్లు వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయని, అయితే ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చిందన్నారు. శంకర్ డైరెక్షన్‌లో ఆయన నటించిన ‘భారతీయుడు2’ ఈ నెల 12న రిలీజ్ కానుండగా HYDలో జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు.