News July 3, 2024

రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి?

image

TG: రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు.. మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు. ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు. 5 ఎకరాలు, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.

Similar News

News July 8, 2024

50 రోజుల సెలవుల తర్వాత తెరుచుకున్న సుప్రీంకోర్టు

image

నెలన్నర వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఆరంభమైంది. సెలవుల కారణంగా మే 20న కోర్టు మూతపడగా నేడు తెరుచుకుంది. దీంతో లాయర్లు న్యాయస్థానం లోపలికి వెళ్లేందుకు క్యూ కట్టారు. కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధత, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా, పతంజలి లాంటి ముఖ్యమైన కేసులపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉంది.

News July 8, 2024

సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారనే <<13585753>>ప్రచారానికి<<>> బలం చేకూరినట్లైంది. రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా చల్లా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News July 8, 2024

హైదరాబాద్‌లో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు

image

చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో చంద్రబాబు, వైఎస్సార్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చంద్రబాబువి, జయంతి సందర్భంగా వైఎస్సార్ ఫ్లెక్సీలను టీడీపీ, కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీలో ఈ ఇద్దరు నాయకులు సీఎంలుగా హైదరాబాద్ నుంచే పాలన సాగించారు. కాగా, తెలంగాణలోనూ టీడీపీ జెండా ఎగరేస్తామని చంద్రబాబు నిన్న కార్యకర్తల సమావేశంలో చెప్పారు.