News July 3, 2024
TDP నాయకుల వేధింపులకు యువకుడి బలి: YCP

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అయ్యవార్లగొల్లపల్లెలో కేశవ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కేశవ తల్లికి పింఛన్ ఆపేసి టీడీపీ నాయకులు వేధించారు. అతి తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పెన్షన్ అడిగిన కొడుకును టీడీపీ బలితీసుకుంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కడుపు నొప్పి భరించలేక తన సోదరుడు పురుగు మందు తాగాడని కేశవ అన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 20, 2026
క్రైం డేటాను నవీకరించాలి: చిత్తూరు ఎస్పీ

క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాను తక్షణమే నవీకరించాలని.. క్రమం తప్పకుండా అప్ డేట్ చేయాలని ఎస్పీ తుషార్ ఆదేశించారు. పోలీస్ గెస్ట్ హౌస్ లో మంగళవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ క్రైమ్ ఉచ్చులో ప్రజలు పడకుండా చూడాలన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
News January 20, 2026
చిత్తూరు: ‘సైనికుల త్యాగాలను తెలియజేయాలి’

సైనికుల త్యాగాలను విద్యార్థులకు తెలియజేయాలని ఎస్పీ తుషార్ సూచించారు. చిత్తూరు పట్టణంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన 78వ జాతీయ సైనికుల దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. జమ్ములో టెర్రరిస్టుల దాడిలో మృతి చెందిన అమరవీరుడు కార్తీక్ చిత్ర పటానికి ఆయన నివాళులు అర్పించారు. మనం ప్రశాంతంగా ఉన్నామంటే సరిహద్దుల్లో సైనికుల కృషియేనని ఆయన కొనియాడారు.
News January 20, 2026
పలమనేరు: 23 ఏనుగులు మృతి!

కౌండిన్య అభయారణ్యంలో నిన్న మొదటి ఏనుగు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా అటవీ పరిధిలో ఇప్పటివరకు 23 ఏనుగులు మృతి చెందాయి. గత పది ఏళ్లలో 15 ఏనుగులు కరెంట్ షాక్‌తోనే మృతి చెందాయి. ఏనుగులకు ప్రమాదాలు వాటిల్లకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


