News July 3, 2024
రోహిత్‌కి బాల్ విసిరేద్దామనుకున్నా: సూర్య

T20WC ఫైనల్‌లో తాను అందుకున్నది క్లీన్ క్యాచ్ అని సూర్య కుమార్ స్పష్టం చేశారు. ‘సాధారణంగా రోహిత్ భాయ్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేయరు. కానీ అప్పుడు చేశారు. మిల్లర్ క్యాచ్ రోహిత్ తీసుకుంటారేమోనని ఒక్క క్షణం ఆయన వైపు చూశా. ఆయనా నా వైపు చూశారు. నేను పరిగెత్తుకెళ్లి క్యాచ్ అందుకున్నా. రోహిత్ నాకు దగ్గర్లో ఉంటే బంతిని అతడికి విసిరేద్దామనుకున్నా. కానీ సమీపంలో లేక నేనే మళ్లీ అందుకున్నా’ అని SKY చెప్పారు.
Similar News
News March 14, 2026
టుడే టాప్ స్టోరీస్

* AP రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ డబ్బులు జమ
* మూసీ అభివృద్ధిని అడ్డుకోకండి: CM రేవంత్
* LPG సిలిండర్ల సమస్య పరిష్కారానికి AP, TG ప్రభుత్వాల చర్యలు
* TGSRTCలో సమ్మె సైరన్
* మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్
* దేశంలో ఒక్కరోజే 75లక్షల సిలిండర్ల బుకింగ్స్
* ప్రజలు ఆందోళన పడి సిలిండర్లు బుక్ చేయొద్దు: కేంద్రం
* యుద్ధ ప్రభావంతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
News March 14, 2026
వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్: తుమ్మల

TG: వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్‌లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ క్రమంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్‌లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
News March 14, 2026
మా డ్రెస్సింగ్‌తో మీకేంటి సమస్య: రాశీ ఖన్నా

కంఫర్ట్‌గా ఉండే దుస్తులు ధరించే స్వేచ్ఛ ఏ అమ్మాయికైనా ఉంటుందని హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. ‘ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది అమ్మాయి ఇష్టం. మేము ఏ దుస్తులు ధరిస్తే మీకేంటి సమస్య’ అని ప్రశ్నించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్లలో ఆమె పాల్గొన్నారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై <<18746820>>చర్చ జరగడాన్ని<<>> ప్రస్తావించగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, పెళ్లికి ఇప్పుడు సమయం లేదని చెప్పారు.


