News July 3, 2024

DSC అభ్యర్థులకు BIG ALERT

image

AP: ఎన్నికలకు ముందు ప్రకటించిన DSCకి దరఖాస్తు చేసిన వారు మెగా DSCకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి లోకేశ్ వెల్లడించారు. మెగా DSC, TETకు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. వయోపరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.

Similar News

News July 8, 2024

విశ్వాస పరీక్ష నెగ్గిన సోరెన్ ప్రభుత్వం

image

ఝార్ఖండ్‌ CM హేమంత్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. 5 నెలల తర్వాత బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన ఆయన ఇటీవల CMగా బాధ్యతలు చేపట్టారు. ఇవాళ అసెంబ్లీలో CM విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 76మంది ఎమ్మెల్యేలుండగా JMM, కాంగ్రెస్, RJD నేతృత్వంలోని ప్రభుత్వం 45ఓట్లు సాధించింది. BJP సారథ్యంలోని విపక్షాలకు 30ఓట్లు వచ్చాయి. దీంతో సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు.

News July 8, 2024

ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు ఇలా

image

ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఈనెల నుంచి అమలులోకి వచ్చాయి. ₹3కోట్లలోపు FDకి జనరల్ కేటగిరిలో 3-7.20%, సీనియర్ సిటిజన్లకు 3.50-7.75% వడ్డీని ICICI ఆఫర్ చేస్తోంది. 15-18 నెలల టెన్యూర్‌కు (7.20%- రెగ్యులర్‌, 7.75%- Sr) అధిక వడ్డీని ఇస్తోంది. యాక్సిస్ సైతం వడ్డీ రేట్లను పెంచింది. గరిష్ఠంగా రెగ్యులర్‌లో 7.20% (17-18 నెలలకు), వృద్ధులకు 7.75% (5-10ఏళ్లు) వడ్డీని అందిస్తోంది.

News July 8, 2024

డ్రగ్స్ టెస్టులో నెగటివ్ వచ్చింది: నటి హేమ

image

బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడటంతో నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్’ రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి లేఖ అందించారు. షోకాజు నోటీసు ఇవ్వకుండా తనని మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం అని వాపోయారు. డ్రగ్స్ టెస్ట్ రిపోర్టులో తనకు నెగటివ్ వచ్చిందని, మళ్లీ ‘మా’లో తన సభ్యత్వాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు. తనకి సపోర్ట్ చేయాలని కోరారు.