News July 3, 2024

విశాఖలో ఉల్లి కోసం క్యూ

image

రైతు బజార్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు క్యూ కడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు టమాటాకు భారీగా డిమాండ్ ఏర్పడడం వల్ల 80 రూపాయల వరకు ధర పలికింది, దీంతో వినియోగదారులు క్యూ కట్టారు. తాజాగా ఉల్లిపాయల ధర కేజీ రూ.36కు చేరుకుంది. రైతు బజార్‌లో తగినంత సరుకు కూడా లేకపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వినియోగదారులు క్యూలో నిల్చొని ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు.

Similar News

News March 13, 2026

నేడు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్

image

డిప్యూటీ సీఎం పవన్ నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా అల్లూరి జిల్లాకి బయలుదేరుతారు. నందిగరువులో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి బేగంపేటకు తిరుగు పయనమవుతారు.

News March 13, 2026

GVMC అజెండాలో వివాదాస్పద అంశాలు

image

GVMC స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం నేడు మేయర్ పీలా అధ్యక్షతన జరగనుంది. ప్రధాన అజెండాలో 193 అంశాలు ఉండగా.. టేబుల్ అజెండాగా మరో 60 అంశాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో తిరస్కరించిన బయో టాయిలెట్‌లు, హెలీపాడ్ పనులు, బీచ్‌రోడ్ గ్రిల్స్ పెయింటింగ్ బిల్లులు మళ్లీ చేర్చడం చర్చనీయాంశమైంది. కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు అప్పట్లో రూ.150గా ఉన్న ఖర్చును ఇప్పుడు రూ.1500గా చూపిన బిల్లు కూడా అజెండాలో ఉంది.

News March 13, 2026

విశాఖ: షాపుల ముందు చెత్త వేస్తున్నారా? రూ.5000 జరిమానా తప్పదు!

image

వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం 20వ వార్డులో పర్యటించిన ఆయన, రోడ్లపై వ్యర్థాలు వేసిన బ్లింకిట్ అవుట్‌లెట్‌కు రూ.10 వేలు, పాన్ షాపునకు రూ.5 వేల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వాణిజ్య సముదాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్లాప్ వాహనాలు సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు