News July 3, 2024
శ్రీకాకుళం: శుభకార్యానికి వెళ్తుండగా హత్య

పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి(30) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే
మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి ఇద్దరు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వాల్తేరు వెళ్తుండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గోపాల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 12, 2026
కాశీబుగ్గ: చిన్న తిరుపతి వెంకన్నకు కష్టాలు తప్పవా?

తిరుపతిలోని వేంకటేశ్వురుడి దర్శనం జరగనందున ఆవేదన చెంది కాశీబుగ్గలో ఏకంగా ఆ శ్రీనివాసుడికి ధర్మకర్త పండా గుడి కట్టారు. భక్తుల దర్శనాలు జరుగుతున్న క్రమంలో..గతేడాది NOV1న తొక్కిసలాటలో 9 మంది మృతి చెందగా ఆలయాన్ని మూసేశారు. పునఃప్రారంభానికి శరవేగంగా పనులవుతున్నాయి. ఇంతలోనే భారీ <<18834092>>చోరీ<<>> జరిగింది. పూజలందుకోవాల్సిన వెంకన్నకు కష్టాలు తప్పడం లేదని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.
News January 12, 2026
అంతర్జాతీయ బ్యాడింటన్ పోటీలకు అంపైర్‌గా కవిటి వాసి

కవిటి గ్రామానికి చెందిన తుంగాన శరత్ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు అంపైర్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 13-18 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే పోటీలకు ఆయన అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఎంపికకు సంబంధించి రాష్ట్ర, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ల నుంచి ఆదివారం అధికారిక ఉత్తర్వులు అందినట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జయరాం తెలిపారు.
News January 12, 2026
శ్రీకాకుళం: జనరల్ బోగీలతో ప్రత్యేక రైలు..ఈ నెల18 వరకే ఛాన్స్

సంక్రాతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12-18 వరకు జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వాల్టేర్ డివిజన్ సీనియర్ డీసీ పవన్ కుమార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-విజయవాడ(08567-68) ట్రైన్ విశాఖలో ఉదయం 10గం.లకు బయలుదేరి సాయంత్రం 4గం.టలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ మధ్య సాయంత్రం 6.30. గంలకు ప్రారంభమై అర్ధరాత్రి12.30 గం.ల వరకు నడవనుంది.


