News July 3, 2024

టీషర్ట్‌, టోన్డ్ జీన్స్‌తో కాలేజీకి రావొద్దు!

image

టీషర్ట్‌, టోన్డ్ జీన్స్‌ కాలేజీకి రావొద్దని ముంబైలోని చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ విద్యార్థులకు హుకుం జారీ చేసింది. విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో వస్తే అనుమతించమని స్పష్టం చేసింది. గతనెలలో ఇదే సొసైటీ కళాశాల ప్రాంగణంలో హిజాబ్‌, బుర్ఖా, నకాబ్‌, టోపీలపై నిషేధం విధించింది. దానిపై పలువురు విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. నిషేధాన్ని హైకోర్టు సైతం సమర్థించింది.

Similar News

News July 8, 2024

వ్యవసాయ రుణాల టార్గెట్ పెంచనున్న కేంద్రం?

image

వ్యవసాయ రుణాల టార్గెట్‌ను 25% పెంచి ₹25లక్షల కోట్లకు చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పెంపు పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ గణాంకాలపై ఆధారపడి ఉంటుందని కేంద్ర వర్గాలు తెలిపాయి. FY24లో సాగు రుణాల టార్గెట్‌ ₹20లక్షల కోట్లు ఉండగా, క్షేత్రస్థాయిలో రుణాల మంజూరు (₹24.84లక్షల కోట్లు) ఆ టార్గెట్‌ను అధిగమించింది.

News July 8, 2024

రూ.900 కోట్ల కలెక్షన్లు సాధించిన ‘కల్కి’

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ రూ.వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది. జూన్ 27న రిలీజైన ‘కల్కి’ ఇప్పటివరకు రూ.900 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 12న ‘భారతీయుడు-2’ రిలీజ్ కానుండగా అప్పటివరకూ ‘కల్కి’ ఫీవర్ కొనసాగనుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్, విజయ్ దేవరకొండ, దీపికా పదుకొణె, దిశా పటాని నటించారు.

News July 8, 2024

‘బాస్’లను అమ్మకానికి పెడుతున్నారు!

image

చైనాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తమకు నచ్చని బాస్‌లు, సహోద్యోగులను కొందరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా బాస్‌ ఫర్ సేల్, కొలీగ్స్ ఫర్ సేల్ అనే ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. రూ.4లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ధర ఫిక్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా అమ్మడం, కొనడం జరగవు. కేవలం సంతృప్తి కోసమే అలా ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేస్తున్నారు.