News July 3, 2024

నల్లమలలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న

image

AP: నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో అడవి దున్న కెమెరా ట్రాప్‌లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్యపోతున్నారు. వెలుగోడు రేంజ్‌లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.

Similar News

News April 4, 2026

పాక్‌పై భారత్ మరోసారి దాడి చేస్తుందా?

image

పశ్చిమాసియా యుద్ధంతో పాక్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. దీన్నే అవకాశంగా మలుచుకొని దాయాదిని దెబ్బకొట్టాలని IND భావిస్తోందా? ఉగ్రవాదాన్ని పోషిస్తూ కంట్లో నలుసులా మారిన PAKను OpS-2తో నాశనం చేయడానికి సిద్ధమవుతోందా? త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ భేటీలు, పాక్‌కు <<19547918>>వార్నింగ్<<>>, రాష్ట్రాల్లో మాక్ డ్రిల్, ప్రజలకు 3 నెలల రేషన్(యుద్ధం వస్తే ఇబ్బంది పడకుండా) సరఫరా ఈ ప్రశ్నలకు బలం చేకూరుస్తున్నాయి.

News April 4, 2026

BRS ఖాతాలో మరో రెండు మున్సిపాలిటీలు

image

TG: గతంలో వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాలను BRS కైవసం చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తాజాగా జరిగిన ఎన్నికలో రెండు మున్సిపాలిటీలను ఖాతాలో వేసుకుంది. క్యాతనపల్లి ఛైర్మన్‌గా గొడిశెల సంధ్యారాణి, ఇబ్రహీంపట్నం ఛైర్మన్‌గా సుదర్శన్‌ రెడ్డి ఎన్నికయ్యారు.

News April 4, 2026

బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

image

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, నూడిల్స్‌, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.