News July 3, 2024

జీతాల కోసం ఏయూ ఉద్యోగుల ఎదురుచూపులు..!

image

జీతాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మూడో తేదీ వచ్చినా ఉద్యోగులకు ఖాతాల్లో ఇంకా జీతాలు పడలేదు. ప్రతినెలా ఉద్యోగుల జీతాలకు దాదాపు రూ.36 కోట్లు వరకు ఖర్చవుతుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై స్వయంగా వీసీ సంతకం పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఏయూ వీసీ తన పదవికి రాజీనామా చేయగా, కొత్తవారిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నియమించలేదు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌‌తో పాలన సాగుతోంది.

Similar News

News July 8, 2024

అనకాపల్లి: ఆచూకీ చెబితే రూ.50వేలు బహుమతి

image

రాంబిల్లి మండలం కొప్పుగుంటపాలెంలో బాలికను హత్య చేసిన హంతకుడి వివరాలు తెలిపితే రూ.50 వేలు బహుమతి అందజేస్తామని అనకాపల్లి పోలీస్ శాఖ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హంతకుడి కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రకటన విడుదల చేసింది. హంతకుడి పేరు బోడాబత్తుల సురేశ్‌గా పేర్కొంది. ఆచూకీ తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, 94407 96084 నంబర్‌కు తెలియజేయాలని కోరింది.

News July 8, 2024

విశాఖ ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీ ప్రోగ్రాం ప్రారంభం

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీ మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. గంభీరంలోని ఐఐఎం క్యాంపస్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఐఎం సంచాలకులు ఆచార్య ఎం.చంద్రశేఖర్ హాజరయ్యారు. విభిన్న రంగాల్లో అపార అనుభవం కలిగిన నిపుణులకు పీహెచ్డీలో ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం డీన్ కావేరి కృష్ణన్, రీసెర్చ్ డీన్ అమిత్ శంకర్ పాల్గొన్నారు.

News July 8, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డల్లాస్‌లో నిరసనలు

image

అమెరికాలోని డల్లాస్‌లో థామస్ జేఫర్ సన్ పార్కులో ప్రవాసాంధ్రులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సెయిల్ ‌లో స్టీల్ ప్లాంట్ ‌ను విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు తెలుగు వారి గండె చప్పుడుగా పేర్కొన్నారు.