News July 3, 2024

సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్@80,000

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 560 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ తొలిసారిగా 80వేల మార్క్ తాకింది. మరోవైపు నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,277 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది. HDFC, యాక్సిస్, ICICI, కోటక్ బ్యాంకుల షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐటీ మినహా ఇతర ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News January 14, 2026

ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నుంచి ‘SIR’

image

AP, TGలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో తొలి దశ ముగియడంతో రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, TN, UP, WB సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో మూడో దశలో ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ‘సర్’ చేపట్టనున్నారు.

News January 14, 2026

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 14, 2026

‘సంక్రాంతి’ అంటే ఏంటో మీకు తెలుసా?

image

సంక్రాంతి అంటే సూర్యుడు ఓ రాశి నుంచి మరొక రాశిలోకి మారడం. ఇది ‘శంకర’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. శంకర అంటే కదలిక. ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుందని, గ్రహాల గమనం వల్లే సృష్టి నడుస్తుందని దీనర్థం. సంస్కృతంలో ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే మార్పు. సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతున్నా, ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ‘మకర సంక్రాంతి’ని మనం పెద్ద పండుగగా జరుపుకుంటాం. ఈ మార్పు అభ్యుదయానికి సంకేతం.