News July 3, 2024
నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, తూ.గో., ప.గో., కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.
Similar News
News January 15, 2025
మనోజ్‌పై చర్యలు తీసుకోండి.. మోహన్ బాబు ఫిర్యాదు
AP: కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 200 మందితో మోహన్ బాబు వర్సిటీలోకి <<15163428>>ప్రవేశించేందుకు<<>> మనోజ్ ప్రయత్నించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లొద్దని పోలీసులు చెప్పినా వినలేదన్నారు. డైరీఫాం గేటు దూకి లోపలకి ప్రవేశించారని పేర్కొన్నారు.
News January 15, 2025
GOOD NEWS: IBPS జాబ్ క్యాలెండర్ విడుదల
బ్యాంకు ఉద్యోగార్థులకు IBPS గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. RRBలో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలకు సంబంధించిన జాబితా ఇందులో ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇతర పూర్తి వివరాల కోసం <
News January 15, 2025
బ్యాక్ టు హైదరాబాద్
సంక్రాంతి పండగ ముగియడంతో ప్రజలు మహానగర బాట పట్టారు. గత 3-4 రోజులుగా స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన వారంతా తిరుగుపయనమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రేపటి నుంచి ట్రాఫిక్ మరింత పెరగనుంది. అటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.