News July 3, 2024

BREAKING: నంద్యాలలో రైలు నుంచి కిందపడి ఇద్దరి మృతి

image

నంద్యాలలోని మూలసాగరం రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం రైలు నుంచి జారి పడి ఇద్దరు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 4, 2026

కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

కర్నూలు జిల్లా ప్రజలు ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇటీవల అత్యవసరం ఉందని చెప్పి డబ్బులు తీసుకొని PhonePe/Google Pay చేశామని చూపించి మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాల్లో డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం లేదా హోల్డ్‌లో పడిపోవడం వల్ల బాధితులు నష్టపోతారని చెప్పారు. అపరిచితులతో డిజిటల్ లావాదేవీలు చేయవద్దన్నారు.

News April 3, 2026

చేనేతకు ఉచిత విద్యుత్.. 41 వేల మందికి లబ్ధి

image

ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసిందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా హ్యాండ్‌లూమ్ నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 41,046 మంది లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.25.56 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరిస్తోందన్నారు.

News April 3, 2026

విషాదం.. లారీ బోల్తా పడి రైతు మృతి

image

మంత్రాలయం మండలం రచ్చమర్రిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యాకోబు గుంటూరులో మిరపకాయలు అమ్ముకుని తిరుగు ప్రయాణంలో ఆత్మకూరు ఘాట్ వద్ద లారీ బోల్తా పడటంతో బియ్యం సంచులు మీద పడి మృతి చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పలువురు ప్రజా సంఘాలు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.