News July 3, 2024

అమ్మాయిలా ‘విశ్వక్‌సేన్’.. ‘లైలా’ ఫస్ట్ లుక్ రిలీజ్

image

మాస్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో విశ్వక్‌సేన్ తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ ‘లైలా’ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు జరగ్గా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. లేడీ గెటప్‌లో విశ్వక్ బ్యూటిఫుల్‌గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా 2025 FEB 14న మూవీ రిలీజ్ కానుంది.

Similar News

News January 27, 2026

బెంగళూరు అంకుల్ అంటూ జగన్‌పై టీడీపీ సెటైర్లు

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ Xలో సెటైరికల్ పోస్ట్ చేసింది. ‘ఏ బెంగ, బెదురులేని దొంగ బెంగళూరు అంకుల్‌. ఆయనకు దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. సంక్రాంతికి సొంతూరు రాడు. రిపబ్లిక్ డేని పట్టించుకోడు’ అని పేర్కొంది. దీనిపై వైసీపీ శ్రేణులు ఫైరవుతున్నాయి. ముందు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ కౌంటర్ ఇస్తున్నాయి.

News January 27, 2026

రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9లక్షల పరిహారం

image

UPలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని 7ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత రైల్వేపై కేసు గెలిచింది. 2018లో రైలు ఆలస్యం వల్ల ఆమె Bsc ప్రవేశ పరీక్ష రాయలేకపోయింది. దీంతో పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. రైలు ఆలస్యమవడంపై అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడంతో ఆమెకు 45 రోజుల్లో రూ.9.10L చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైతే 12% వడ్డీ చెల్లించాలని పేర్కొంది.

News January 27, 2026

జనవరి 27: చరిత్రలో ఈరోజు

image

1922: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ జననం
1927: తెలుగు కవి, రచయిత పోతుకూచి సాంబశివరావు జననం
1936: కథా, నవలా రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి జననం
2009: భారత మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ మరణం
2023: సినీ నటి జమున మరణం (ఫొటోలో)
* కుటుంబ అక్షరాస్యత దినోత్సవం