News July 3, 2024

KNR: బీరు సీసాతో హత్యాయత్నం.. ఐదుగురిపై కేసు

image

హత్యాయత్నం కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు చిగురుమామిడి SI రాజేష్ తెలిపారు. సైదాపూర్(M) దుద్దెనపల్లికి చెందిన శ్రీనివాస్ స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి సుందరగిరి బస్టాండ్‌లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో సుందరగిరికి చెందిన అఖిల్, అజయ్, వేణు, నాగరాజు, సుమిత్‌లు శ్రీనివాసును బీర్ సీసాతో హత్య చేయబోగా తప్పించుకున్నాడు. శ్రీనివాస్ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేశారు.

Similar News

News July 8, 2024

జగిత్యాల ప్రజావాణిలో 58 ఫిర్యాదులు

image

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 58 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పి.రాంబాబు, రఘువరన్ ఆర్డీవోలు మధుసూదన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News July 8, 2024

తిట్లు, ఆరోపణలు బంద్ చేద్దాం : కేంద్రమంత్రి బండి

image

తిట్లు, ఆరోపణలు బంద్ చేసి.. అభివృద్ధిపై ఫోకస్ పెడదామని హోంశాఖ సహాయకమంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని, కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. సిరిసిల్లలో మున్నూరుకాపు సంఘ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికలైపోయినయ్.. ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దామని ఆయన హితవు పలికారు.

News July 8, 2024

జగిత్యాల: నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో 5 నెలల చిన్నారికి చోటు

image

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ 5నెలల చిన్నారి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కథలాపూర్ మండలానికి చెందిన మహేందర్-మౌనికల కూతురు ఐర(5నెలలు). అయితే ఐరాకు 2 నెలల వయసు నుంచే పలు రకాల వస్తువులు, బొమ్మలు, కార్డులను చూపించి గుర్తుపట్టేలా తండ్రి తీర్ఫీదు ఇచ్చాడు. ఇటీవల ఐరా 135 రకాల ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టిన వీడియోను నోబెల్ సంస్థకు ఆన్‌లైన్‌లో పంపడంతో.. ధ్రువపత్రం, మెడల్‌ను పంపారు.