News July 3, 2024

విజయవాడ: ప్రైవేటు ఆసుపత్రిలో కవలలు మృతి

image

విజయవాడ రూరల్ మండలం పడమటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున కవల పిల్లలు మృతి తీవ్ర కలకలం సృష్టించింది. గంగూరు సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ సతీమణి బండ్రపల్లి మాధవి, ప్రైవేటు ఆసుపత్రిలో నేటి ఉదయం కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కవలలు మృతి చెందినట్లు మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News March 17, 2026

సంక్షేమ వసతి గృహాలపై కృష్ణా కలెక్టర్ సమీక్ష

image

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల పురోగతిపై మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమీక్షించారు. 61 హాస్టళ్ల అభివృద్ధికి రూ.10.35 కోట్లు మంజూరు కాగా, రూ.5 కోట్లతో 46 హాస్టళ్లలో పనులు పూర్తయ్యాయన్నారు. తాగునీరు, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News March 17, 2026

కృష్ణా: 82 అంగన్వాడీ పోస్టులకు నేడే చివరి తేదీ

image

కృష్ణా జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 21-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు అర్హులన్నారు. ఈ నెల 17లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు.

News March 17, 2026

కృష్ణా: వారికి నేడే ఆఖరి రోజు!

image

జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు నేడు చివరి రోజు కానుంది. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలనకు ముగింపు పలుకుతూ, రేపటి నుంచి పట్టణ పరిపాలన పూర్తిగా ప్రభుత్వ నియమిత ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల నియామకానికి మార్గదర్శకాలు జారీ చేసి అధికారులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో పరిపాలన కొనసాగింపు బాధ్యతలు అధికారులు చేపట్టనున్నారు.