News July 3, 2024

తలలో పెన్ను గుచ్చుకున్న బాలిక మృతి

image

<<13550256>>తలలో పెన్ను గుచ్చుకున్న<<>> నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. సోమవారం భద్రాచలం సుభాష్ నగర్‌లో ప్రమాదవశాత్తు పెన్నుగుచ్చుకుంది. ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసి వైద్యులు నిన్న పెన్ను తొలగించారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం బాలిక మృతి చెందింది.

Similar News

News November 6, 2025

పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి: ఇన్చార్జ్ కలెక్టర్

image

పీఎం శ్రీ నిధులను అధికారులు సమర్థవంతంగా వినియోగించాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిధుల వినియోగంపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపికైన 28 పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, క్రీడా అభివృద్ధి, యూత్ ఎకో క్లబ్ ఏర్పాటు, పరిశ్రమల విజిట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

News November 6, 2025

పోష్, పోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఇన్చార్జ్ కలెక్టర్

image

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగ స్థలాల్లో మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సూచించారు. పిల్లల రక్షణకు పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు.

News November 6, 2025

ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను చేరుకోవాలి: అదనపు కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ఆయిల్ పామ్ పంట శిక్షణ కార్యక్రమంలో అ. కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక లాభాలను అందిస్తుందని, ఎటువంటి నష్టం సంభవించదని తెలిపారు. రైతులకు అంతర్ పంటల ద్వారా కూడా ఆదాయం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి మధుసూదన్ పాల్గొన్నారు.