News July 3, 2024
విశాఖలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

విశాఖలోని కంచరపాలెం వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఘటనా స్థలంలోనే తండ్రి మరణించగా.. కొడుకు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 29, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు గమనిక..!

విశాఖ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే సమతా ఎక్స్‌ప్రెస్(12807/12808)ను APRలో కొన్నిరోజులు రద్దు చేశారు. గోండియా స్టేషన్‌లో పనుల కారణంగా, రైలు సర్వీసులను క్యాన్సిల్ చేశారు. APR 5, 7, 8, 9, 11, 12, 14, 15, 16, 18, 19, 21, 22, 23 తేదీలలో విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్లే రైళ్లను.. APR 7, 9, 10, 11, 13, 14, 16, 17, 18, 20, 21, 23, 24, 25 తేదీలలో హజరత్ నిజాముద్దీన్ నుంచి విశాఖ వచ్చే రైళ్లను రద్దు చేశారు.
News March 28, 2026
విశాఖ: డీఆర్వోగా విశ్వేశ్వర నాయుడు బాధ్యతలు

విశాఖ జిల్లా డీఆర్వోగా విశ్వేశ్వర నాయుడును ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు విశాఖ జిల్లా అభివృద్ధిలో భాగస్వామినవుతానని పేర్కొన్నారు.
News March 28, 2026
విశాఖలో రక్తమోడుతున్న రహదారులు

విశాఖ రోడ్లు రక్తమోడుతున్నాయి. జిల్లాలో 2025లో 1,110 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 340 మంది మృతి చెందారు. లారీలు, ట్యాంకర్ల వల్ల 140 ప్రమాదాల్లో 80 మంది చనిపోగా 104 మంది గాయపడ్డారు. హిట్ అండ్ రన్ కేసులు 43 నమోదై, 25 మంది మృతిచెందగా 26 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాలు 4% తగ్గినా మరణాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.


