News July 3, 2024
జనగామ: పశువులపై హైనా దాడి.. గేదె మృతి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో పశువులపై హైనా దాడి చేసింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిక్షపతి అనే రైతుకు చెందిన పశువులపై హైనా దాడి చేసింది. ఈ ఘటనలో ఓ గేదె మృతి చెందింది. గతంలో సైతం హైనా దాడిలో తమ పశువులు మృత్యువాత పడ్డాయని గ్రామస్థులు ఆవేదన చెందారు. అటవీ శాఖ అధికారులు వాటిని కట్టడి చేయాలని కోరారు.
Similar News
News December 30, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్
> MLG: విద్యుత్ షాకుతో రైతు మృతి..
> MHBD: కొమ్ములవంచలో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
> WGL: తిమ్మంపేట లో గుట్కా ప్యాకెట్లు పట్టివేత..
> JN: డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
> WGL: తల్లి, కూతురు సూసైడ్ అటెంప్ట్
> MLG: అడవి పంది, అడవి కోడిని వేటాడిన వ్యక్తులపై కేసు
> WGL: ధర్మారంలో గుర్తుతెలియని మృతదేహం
News December 29, 2024
నల్లబెల్లి: కూతురు, తల్లి సూసైడ్ ATTEMPT
కూతురికి పురుగు మందు తాగించి తల్లి కూడా తాగిన ఘటన నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. శ్రీను సంతానం కోసం మానసను రెండో వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితంలో విఘ్నేశ్, సాత్విక జన్మించారు. కాగా కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పురుగు మందు తాగి కూతురికి కూడా తాగించింది. గమనించిన స్థానికులు 108లో నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.
News December 29, 2024
నల్లబెల్లి: అక్కడా, ఇక్కడా ఒకటే పులి
నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో నిన్న గ్రామస్థులకు పులి కనిపించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కొత్తగూడ, నల్లబెల్లిలో సంచరించిన పులి ఒకటేనని వారు స్పష్టం చేశారు. కాగా, నల్లబెల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. శనివారం ఓ మహిళకు, పొలానికి వెళ్లిన రైతులకు పెద్దపులి కనిపించింది.