News July 3, 2024
పట్టాలెక్కిన రెండో లైను.. 3 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి గుం’టూరు’

సికింద్రాబాద్-గుంటూరు రూట్లో నల్లపాడు-BBనగర్ మధ్య 248KM మేర 2వ లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు పట్టాలెక్కాయి. ₹2853కోట్ల ఈ ప్రాజెక్టును 4 దశల్లో పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులో పనులు ప్రారంభం కానున్నాయి. పూర్తైతే 3 గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. ప్రస్తుతం సింగిల్ లైన్ వల్ల ఒక రైలు వస్తుంటే మరొకటి స్టేషన్లో ఆగాల్సి వస్తోంది. 140% సామర్థ్యంతో ఈ రూట్లో రైళ్లు నడుస్తున్నాయి.
Similar News
News July 6, 2025
స్టాంప్ సవరణ బిల్లుతో ఉపయోగాలివే..

తెలంగాణ స్టాంప్ సవరణ బిల్లు-2025 తేవాలని <<16956370>>ప్రభుత్వం<<>> నిర్ణయించడంపై దీని ఉపయోగాలు ఏంటనే చర్చ మొదలైంది. చట్ట సవరణతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. కార్పొరేట్ సేవల రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీని పెంచడం, రియల్ ఎస్టేట్, వాణిజ్య ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడంతో అదనపు ఆదాయం సమకూరుతుంది. నకిలీ స్టాంప్ పేపర్లు, డూప్లికేట్లు, స్కామ్‌లకు అడ్డుకట్ట వేయొచ్చు.
News July 6, 2025
రేపు భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
News July 6, 2025
సీజేఐ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించండి: SC అడ్మినిస్ట్రేషన్

సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని చీఫ్ జస్టిస్ బంగ్లాను వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాన్ని సూచించింది. ప్రస్తుతం అందులో మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. CJIగా చంద్రచూడ్ 2022 NOV నుంచి 2024 NOV వరకు పనిచేశారు. నిబంధన ప్రకారం రిటైర్మెంట్ తర్వాత 6నెలల వరకే(మే 31) ఆయనకు బంగ్లాలో ఉండటానికి అనుమతి ఉందని గుర్తు చేసింది.