News July 3, 2024

మెరుగైన జీవితానికి 80/20 సూత్రం: గోయెంకా

image

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా జీవితంలో సక్సెస్ అయ్యేందుకు 80/20 సూత్రాన్ని పాటించాలని సూచించారు. ‘ఆరోగ్యం కోసం 80% ఆహారం, 20% వ్యాయామంపై దృష్టి పెట్టండి. బెటర్ కమ్యూనికేషన్ కోసం 80% వింటే 20% మాత్రమే మాట్లాడండి. 80% అర్థం చేసుకోవడం, 20% చదువుకోవడం ద్వారా పలు విషయాలను నేర్చుకోండి. విజయం పొందాలంటే 20% ప్లానింగ్ ఉంటే 80% పనిచేయాలి. బలమైన సంబంధాల కోసం 80% ఇస్తే 20 % మాత్రమే ఆశించండి’ అని తెలిపారు.

Similar News

News September 21, 2024

కొత్త స్టడి: మందు బాటిల్‌పై కేలరీల లేబుల్‌‌తో సేవించే మోతాదు తగ్గిస్తారు!

image

బాటిల్‌పై కేల‌రీల‌ లేబుల్ ఉంచితే మందుబాబులు మ‌ద్యం సేవించే మోతాదును త‌గ్గించుకొనే అవ‌కాశం ఉంద‌ని ఇంగ్లండ్‌లో జ‌రిపిన ఓ అధ్య‌య‌నం తేల్చింది. 4,684 మంది పెద్దలపై UCL పరిశోధకులు అధ్య‌య‌నం జ‌రిపారు. దీని ప్ర‌కారం బాటిళ్ల‌పై కేలరీల లేబుల్‌లను జోడిస్తే, సగం కంటే ఎక్కువ మంది మద్యం ప్రియులు తమ మద్యపాన అలవాట్లను మార్చుకుంటారని కనుగొన్నారు. సేవించే మోతాదు ఎంతున్నా తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారన్నారు.

News September 20, 2024

దిగ్గజాల సరసన యశస్వీ జైస్వాల్

image

భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించారు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ 10 టెస్టుల్లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్క్ టేలర్(1,088)ను అధిగమించారు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్(1,446) అగ్ర స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఎవర్టన్ వీక్స్(1,125), జార్జ్ హెడ్లీ(1,102) కొనసాగుతున్నారు.

News September 20, 2024

కల్తీ నెయ్యి ఘటన.. దేవాదాయశాఖ అప్రమత్తం

image

AP: తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసే యోచనలో దేవదాయశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.