News July 3, 2024

HYD: రేపు విద్యాసంస్థల బంద్‌: AISF

image

నీట్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని AISF నాయకులు ఆరోపించారు. AISF హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 4న విద్యాసంస్థల బంద్‌‌కు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. నాయకులు వంశీ, అరుణ్, వెంకటేశ్, ఉపేందర్, బన్నీ, భాను, వరుణ్ ఉన్నారు.

Similar News

News March 24, 2026

HYD: డీలిమిటేషన్‌తో మన గొంతు నొక్కేస్తారా?

image

లోక్‌సభ స్థానాల పెంపుపై TG అసెంబ్లీ నిరసన వ్యక్తం చేసింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, నియంత్రణ పాటించిన మనకి అన్యాయం జరుగుతుందని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సైబరాబాద్‌లో సీట్లు పెరిగినా, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో తగ్గుతుందన్నది ఆందోళన. మల్కాజిగిరి, చేవెళ్ల MP స్థానాలను విభజించే క్రమంలో మహిళా రిజర్వేషన్ 33% అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో రాజకీయంగా భారీ మార్పులకు లోనుకానుంది.

News March 24, 2026

మాదాపూర్‌లో బండరాళ్ల మధ్య బతుకు పోరాటం

image

ఎలాంటి వసతులు లేకపోయినా పెద్దపెద్ద బండరాళ్ల మధ్యే షాపును ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతోన్న ఓ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మాదాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో బండరాళ్ల మధ్యే చిన్న టీ దుకాణాన్ని పెట్టుకొని ఆయన తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరకొర షెడ్డుతో, రాళ్ల పక్కనే నిత్యం కూలీలు, కార్మికులు, ఉద్యోగులకు టీ అందిస్తూ కష్టజీవిగా గుర్తింపు పొందుతున్నాడు. ఆ కష్టమే ఆయనకు తోడుగా నిలుస్తోంది.

News March 24, 2026

SC వర్గీకరణతో.. సైబరాబాద్ పాలి‘ట్రిక్స్’

image

సర్కార్ అమలు చేసిన SC వర్గీకరణ ఇప్పుడు సైబరాబాద్ (CURE) రాజకీయాల్లో కీలకంగా మారింది. 15% రిజర్వేషన్‌ను 3 గ్రూపులుగా విభజించారు. CUREలోని శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌లో జనాభా ప్రాతిపదికన వర్గీకరణ అమలవుతుంది. సెన్సస్ తర్వాత SC కోటాను మరింత పెంచే ఛాన్స్ ఉందని సర్కార్ సంకేతమివ్వడంతో ఇక్కడి రిజర్వ్‌డ్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల సంఖ్య పెరిగాక కొత్త సీట్లలో కొన్ని SC/STలకు కేటాయించే అవకాశం ఉంది.