News July 3, 2024
‘35 చిన్న కథ కాదు’ మూవీ టీజర్ అప్డేట్

నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో ‘35 చిన్న కథ కాదు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘ఇదో, మా సిన్న కుటుంబం తొలి సూపు’ అని హీరోయిన్ నివేదా ట్వీట్ చేశారు. డైరెక్టర్ నంద కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Similar News
News March 28, 2026
చెన్నైకి బిగ్ షాక్.. 2 వారాలు ధోనీ దూరం

ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది.
News March 28, 2026
యుద్ధంలోకి యెమెన్ హౌతీలు.. ఇజ్రాయెల్‌పై మిస్సైల్ దాడి

ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు పశ్చిమాసియా యుద్ధంలోకి దిగారు. ఇవాళ యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పైకి బాలిస్టిక్ మిస్సైల్‌ను లాంచ్ చేశారు. దాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఎవరికీ గాయాలు కాలేదంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీల మొదటి దాడి ఇదే. కాగా ఇరాన్‌కు వ్యతిరేకంగా US, ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎవరైనా వస్తే తామూ రణరంగంలోకి దిగుతామని హౌతీలు నిన్న ప్రకటించారు.
News March 28, 2026
రాత్రి ఫోన్ చేసి ఇన్నర్‌వేర్‌పై ప్రొఫెసర్ ప్రశ్నలు!

చెన్నైలోని అన్నా వర్సిటీ ప్రొఫెసర్ జ్ఞానవేల్‌పై ఒక విద్యార్థిని సంచలన ఫిర్యాదు చేశారు. ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని దగ్గరై తనను వేధించాడని బాధితురాలు ఆరోపించారు. రాత్రి వేళల్లో ఫోన్ చేసి ఇన్నర్‌వేర్, పీరియడ్స్, పెళ్లి వంటి పర్సనల్ విషయాలపై అసభ్యంగా మాట్లాడుతూ టార్చర్ పెట్టేవాడని తెలిపారు. నంబర్ బ్లాక్ చేసినా ఇతర మార్గాల్లో వేధించాడని పేర్కొన్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.


