News July 3, 2024
ఆదోని ఎంపీపీ వైసీపీ నుంచి బీజేపీలో చేరిక

ఆదోని మండల పరిషత్ అధ్యక్షురాలు బడాయి దానమ్మ వైసీపీని వీడి బీజేపీలో చేరారు. ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే పార్థసారథి కండువా కప్పి ఆహ్వానించారు. ఆమెతో పాటు కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, పద్మావతి, పలువురు సర్పంచులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి చేరికలు మొదలయ్యాయని, ఆదోనిలో ఆ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు.
Similar News
News January 13, 2026
ఓర్వకల్లుకు ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులు: మంత్రి

తమ ప్రభుత్వం ప్రజల కోసం సమర్థవంతంగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం దృష్టి పెట్టిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. 46వ వార్డు నరసింహారెడ్డి నగర్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కర్నూలు, ఓర్వకల్లుకు ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులు అందించామని తెలిపారు. అబ్దుల్ కలాం పాఠశాల సమస్యకు పరిష్కారం కోసం కూడా కృషి చేస్తున్నారన్నారు.
News January 13, 2026
రైతులకు సులభంగా పంట రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో రైతులు పంట సాగులో ఎదుర్కొంటున్న పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లు సులభంగా పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. ఖరీఫ్ 2026, రబీ 2026-27 పంటలకు కూలీ ఖర్చులు, పెట్టుబడులు, గతేడాది ధరలను పరిగణలోకి తీసుకొని రుణ పరిమితులు నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
News January 13, 2026
ఇంటిల్లిపాది సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి: డీఐజీ

తెలుగు సంస్కృతి సంప్రదాయ మేళవింపు సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భోగి, మకర, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.


