News July 3, 2024
గోల్డ్ మెడల్‌తో పంత్ పోస్ట్.. అక్షర్, సిరాజ్ కామెంట్స్ వైరల్!

టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీని గెలుపొందిన క్రమంలో గోల్డ్ మెడల్‌తో దిగిన ఫొటోను టీమ్ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ఈ మెడల్ మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఇలాంటి మెడల్ తమ దగ్గర కూడా ఉందని అక్షర్ పటేల్‌తో పాటు మహ్మద్ సిరాజ్ కామెంట్స్ చేశారు. వీరంతా ఒకే హోటల్‌లో ఉండి ఇలా చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 3, 2026
రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 పోస్టులు

బెంగళూరులోని <
News March 3, 2026
హైదరాబాద్ to అమరావతి.. గంటన్నరలోపే!

TG: HYD ఫ్యూచర్ సిటీ నుంచి AP అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా అత్యాధునిక సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. TG ప్రభుత్వ ప్రతిపాదనతో మిర్యాలగూడ మీదుగా ఈ అలైన్‌మెంట్ సాగనుంది. గంటకు 250km వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్‌లో గంటన్నరలోపే HYD నుంచి అమరావతికి చేరుకోవచ్చు. ఈ కారిడార్‌ను చెన్నై వరకు పొడిగిస్తే 3 గంటల్లోనే వెళ్లొచ్చు. త్వరలోనే రైల్వేశాఖ DPR సిద్ధం చేయనుంది.
News March 3, 2026
వీధి కుక్కలతోనూ బ్రాండ్ మార్కెటింగ్!

యాడ్స్ కోసం సంస్థలు హోర్డింగ్‌లు, కటౌట్‌లపై ఖర్చు చేసే బదులు సింపుల్‌గా వీధి కుక్కలను వాడుకుంటే ఎలా ఉంటుంది? ఆదిత్య అనే ఓ మాజీ మైక్రోసాఫ్ట్ టెకీకి వచ్చిన ఐడియా ఇది. ‘Stray as a Service’ అనే పేరుతో ఏఐ ఫొటోస్ కూడా షేర్ చేశారు. దేశంలో దాదాపు 3 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని వీటిని యాడ్స్‌కు వాడుకుంటే ఖర్చు తగ్గి, అవి తిరిగేచోటల్లా బ్రాండ్ ప్రమోట్ అవుతుందన్నారు. మరి ఈ ఐడియా ఎలా ఉంది? కామెంట్ చేయండి.


