News July 3, 2024
వైఎస్ జగన్ కేసులపై రోజువారీ విచారణ: హైకోర్టు

TG: సీబీఐ కోర్టులో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్ కేసులపై రోజువారీ విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఆ కేసుల అంశంపై మాజీ మంత్రి హరిరామజోగయ్య గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చాలా కేసులున్న కారణంగా వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని సూచించింది.
Similar News
News March 15, 2026
రేపటి ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భారత జనాభా గణన–2025 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని తహశీల్దారులు, ఎంపీడీవోల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్న కారణంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
News March 15, 2026
ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం ఉంటుందని APSDMA అంచనా వేసింది. ద్రోణి, నైరుతి నుంచి వీచే గాలులతో రేపు SKLM, VZM, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసేందుకు ఆస్కారం ఉందని చెప్పింది.
News March 15, 2026
అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.


