News July 3, 2024
నల్గొండ జిల్లాలో పర్యాటకం అభివృద్ధి

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12 ప్రాంతాలను గుర్తించారు. ఉమ్మడి నల్గొండ నుంచి గాజుబిడెం బ్యాక్ వాటర్‌లో బస, బోటింగ్, నెల్లికల్ ఎకోపార్క్‌లో సఫారీ, కంబాలపల్లి అడవుల్లో ట్రెక్కింగ్ ఉండనుంది. దీంతో స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News March 13, 2026
గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్‌కు 45 రోజుల గడువు

వంట గ్యాస్ సరఫరాపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క సిలిండర్ తర్వాత మరో సిలిండర్ బుకింగ్‌కు కనీసం 45 రోజుల గడువు ఉండాలని నిర్ణయించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 25 రోజుల నిబంధనే కొనసాగుతోంది. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడమే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
News March 13, 2026
NLG: 62 పోస్టులు.. 16న ఇంటర్వ్యూలు

ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది కోసం ఈనెల 16న ప్రిన్సిపల్ ఛాంబర్‌లో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. మెడికల్ కళాశాలలో ఒక ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్స్, 32 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 14 మంది ట్యూటర్స్‌ను తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు రిక్రూట్ చేసుకోనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు.
News March 13, 2026
NLG: ఒక్కో పంటపై రూ.2వేల పెంపు..!

రాబోయే సాగు సీజన్‌కు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పంటల రుణ పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఒక్కో పంటపై అదనంగా రూ.2,000లు పెంచుతూ బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నల్లగొండ జిల్లాలోని సుమారు 5,65,803 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.


