News July 3, 2024
పొలంలో పొంగులేటి.. BRS సెటైరికల్ ట్వీట్

పాలన, పార్టీ కార్యక్రమాలతో
నిత్యం బిజీగా ఉండే మంత్రి పొంగులేటి కల్లూరు మండలం నారాయణపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఫొటోలను తన ట్విటర్ అకౌంట్లో పంచుకున్నారు. పొంగులేటి ట్వీట్‌పై బీఆర్ఎస్ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం హౌస్ అనాలి’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Similar News
News September 15, 2025
‘గ్రామపాలనాధికారులు మెరుగైన సేవలు అందించాలి’

ఖమ్మం: గ్రామపాలనాధికారులు నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు సోమవారం పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. జిల్లాలో 299 క్లస్టర్లకు గాను 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగ్ ఇచ్చామన్నారు.
News September 15, 2025
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ఖమ్మం కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 15, 2025
పటిష్టం..’పాలేరు’

1928లో పాలేరు చెరువు నిర్మించారు. నాటీ చీఫ్ ఇంజీనీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో చతురస్రాకారం బండరాళ్లు, బంకమట్టి, డంగుసున్నం, కాంక్రీట్ లాంటి సీసంతో నిర్మించారు. చెరువు నుంచి నేటికీ చుక్క నీరు కూడా లీక్ కాకపోవడం నాటి ఇంజీనీర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. పాలేరు చెరువు 1978లో రిజర్వాయర్‌గా మారినప్పుడు ఇంజీనీర్లు ఫాలింగ్ గేట్లు ఏర్పాటు చేసి ఘనత సాధించారు. నేడు ఇంజీనీర్స్ డే.