News July 3, 2024

బుద్ధి ఉన్నోళ్లెవరూ అమరావతిని తిరస్కరించరు: సీఎం చంద్రబాబు

image

AP: బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదనలేరని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మూలకైనా సమాన దూరంలో ఉండేలా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నామని స్పష్టం చేశారు. తమ అధ్యయనంలో అత్యధిక శాతం మంది విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండాలని చెప్పారని, ఆ విధంగానే ముందుకెళ్లామని వివరించారు.

Similar News

News February 1, 2026

నిద్ర లేవగానే ఎన్ని నీళ్లు తాగాలి?

image

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఎన్ని తాగాలనే దానిపై పలువురికి సందేహం ఉంటుంది. వైద్యుల సూచన మేరకు ఖాళీ కడుపుతో 1-2 గ్లాసుల(సుమారు 500ML) వరకు తాగొచ్చు. ఇది రాత్రంతా డీహైడ్రేషన్‌కు గురైన శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎక్కువగా తాగితే కిడ్నీలపై భారం పడుతుంది. కడుపు ఉబ్బరం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలొస్తాయి.

News February 1, 2026

బాల్ పడగానే బాదేయడమే: ఇషాన్

image

తనకు మైలురాళ్ల కంటే జట్టు విజయమే ముఖ్యమని సెంచరీ హీరో ఇషాన్ కిషన్ తెలిపారు. నిన్న సెంచరీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘అభిషేక్ మంచి స్టార్ట్ ఇచ్చారు. నేను దాన్ని కొనసాగించా. సింగిల్స్ తీసుకుంటే మంచి ఛాన్స్ మిస్ అయిందని తర్వాత బాధ పడాల్సి వస్తుంది. బాల్ మన రేంజ్‌లో పడగానే బాదే ఛాన్సుంటే బాదేయడమే. నా ఫోకస్ అంతా T20 ప్రపంచకప్ పైనే. అందుకు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ అవసరం. ఫామ్ కంటిన్యూ చేయాలి’ అని చెప్పారు.

News February 1, 2026

IISER తిరుపతిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

AP: తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ <>(IISER<<>>)లో 22 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, MBBS, MD, PG, MSc, MCA, BS-MS, M.LSc, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iisertirupati.ac.in