News July 3, 2024

ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయా: గంభీర్

image

తనకు 11 ఏళ్లు ఉన్నప్పుడు 1992WCలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలవ్వడంతో రాత్రంతా నిద్ర పట్టలేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పారు. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలోనే భారత్ కోసం వన్డే WC సాధించాలని అనుకున్నానని, 2011లో కల నెరవేరిందని పేర్కొన్నారు. 2007 T20, 2011 వన్డే WCలు గెలవడంలో గంభీర్ ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 31, 2024

వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ

image

AP: రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని పేర్కొంది. ఈ సాయం పొందే పండితులు వారి నివాసానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలంది.

News October 31, 2024

ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు

image

కర్ణాటకలోని హసన్‌ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.

News October 31, 2024

మాజీ మంత్రి అప్పలరాజుకు తీవ్ర అస్వస్థత

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.