News July 3, 2024
డీఎస్సీ ప్రిపరేషన్‌కు సమయం
AP: టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో కొత్త తేదీలు ప్రకటించనుంది. మొత్తం ప్రక్రియ 6 నెలల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించనుంది. అలాగే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారు కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం ఇచ్చింది.
Similar News
News November 11, 2024
సిద్ధిఖీ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు
NCP మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో నలుగురిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో అదుపులోకి తీసుకున్నారు. Oct 12న సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి ఆఫీస్‌లో ఉన్నప్పుడు కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపగా మరణించారు. ఈ కేసులో దాదాపు 20 మంది అరెస్టయ్యారు.
News November 11, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 11, 2024
వేలంలో వాళ్లిద్దర్నీ కొనడం చాలా కష్టం: CSK
IPL వేలంలో పంత్, KL రాహుల్‌పై దృష్టి సారిస్తామని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తాజాగా తెలిపారు. ‘మాకున్న పర్సును బట్టి ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి వారిని కొనడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాం. భారత ప్లేయర్లకు చాలా డిమాండ్ ఉంది’ అని పేర్కొన్నారు. CSKకి ప్రస్తుతం ధోనీ కీపింగ్ చేస్తుండగా, రుతురాజ్ కెప్టెన్సీ చేస్తున్నారు. పంత్ లేదా రాహుల్‌ను కొంటే ఆ రెండు బాధ్యతల్నీ ఒకరే నిర్వర్తించే అవకాశం ఉంది.