News July 3, 2024

హేమంత్ సోరెన్‌కు మళ్లీ సీఎం పగ్గాలు?

image

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు ఇవాళ ఆయనను శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. ల్యాండ్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో 5 నెలలు జైల్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా చంపై సోరెన్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

Similar News

News October 5, 2024

సోడాలు, కాఫీలు ఎక్కువ తాగుతున్నారా..?

image

సోడాలు, కాఫీలు ఎక్కువగా తాగేవారికి పక్షవాతం ముప్పు ఉందంటూ గాల్వే వర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. వాటి వలన డయాబెటిస్, బీపీ పెరుగుతాయని వివరించారు. ఇక కంపెనీలు తయారు చేసే జ్యూస్‌లలో కృత్రిమ షుగర్లు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని, పెరాలసిస్ స్ట్రోక్ ముప్పును పెంచుతాయని హెచ్చరించారు. వాటి బదులు సహజమైన పళ్లరసాలు శ్రేయస్కరమని సూచించారు. ఏం తిన్నా, ఏం తినకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది నేటి పరిస్థితి.

News October 5, 2024

ABHIMANYU: అసాధారణంగా ఆడుతున్నా అవకాశమేదీ?

image

దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరాఖండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. కానీ టీమ్ ఇండియా ఎంట్రీ మాత్రం ఆయనకు అందని ద్రాక్షగా మారిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇరానీ ట్రోఫీలోనూ 191 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. 166 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలతో 7,506 పరుగులు చేశారు. 29 ఏళ్ల అభిమన్యును బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News October 5, 2024

నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

image

సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాచేసి N-కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పేర్కొన్నారు.