News July 3, 2024
గ్రీన్ టాక్స్ తగ్గించేందుకు కృషి: పల్లా శ్రీనివాస్

భారీ వాహనాలకు భారంగా మారిన గ్రీన్ టాక్స్ తగ్గించేందుకు కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక మండలం కూర్మన్నపాలెంలో ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజుల్లోనే అగనంపూడి టోల్ ప్లాజా ఎత్తివేయించానన్నారు.
Similar News
News March 18, 2026
ఎక్సైజ్ ఉద్యోగుల క్రీడల ముగింపు

ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. బుధవారం కొమ్మాది స్పోర్ట్స్ మైదానంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎక్సైజ్ ఉద్యోగుల క్రీడల ముగింపును నిర్వహించగా ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మహేశ్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.
News March 18, 2026
విశాఖ: 69 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

విశాఖలో 69 పరిక్షా కేంద్రాలను అధికారులు బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్ ఏయూ ఇంగ్లిష్ మీడియం స్కూలును సందర్శించి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లును పరిశీలించారు. జిల్లాలో 29,916 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 28,843 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సదుపాయాలు కల్పించామని కలెక్టర్ ఆదేశించారు.
News March 18, 2026
దివ్యాంగ చిన్నారులతో విశాఖ కలెక్టర్ ఆత్మీయ విందు

విశాఖలోని వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.


