News July 3, 2024

వాలంటీర్లు లేకున్నా పింఛన్లు పంపిణీ చేశాం: పవన్

image

AP: వాలంటీర్లు లేకపోతే పథకాలు రావంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారని పిఠాపురం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఒక్క వాలంటీర్‌ సహాయం లేకుండా సచివాలయ సిబ్బందిని ఉపయోగించి దాదాపు ఒక్కరోజులో పింఛన్లు పూర్తి చేశామని వివరించారు. దీనికి ఎంతో అనుభవం కావాలని, అందుకే అపార అనుభవం ఉన్న చంద్రబాబుతో కూటమి ఏర్పాటు చేశామని పవన్ వెల్లడించారు.

Similar News

News October 5, 2024

ABHIMANYU: అసాధారణంగా ఆడుతున్నా అవకాశమేదీ?

image

దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరాఖండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. కానీ టీమ్ ఇండియా ఎంట్రీ మాత్రం ఆయనకు అందని ద్రాక్షగా మారిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇరానీ ట్రోఫీలోనూ 191 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. 166 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలతో 7,506 పరుగులు చేశారు. 29 ఏళ్ల అభిమన్యును బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News October 5, 2024

నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

image

సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాచేసి N-కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పేర్కొన్నారు.

News October 5, 2024

Project Flower గురించి తెలుసా?

image

ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధానికి దిగిన ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు ఒకప్పుడు పరస్పరం సహకరించుకున్నాయి. సైనిక సహకారం కోసం Project Flower పేరుతో 1977లో ఇరాన్-ఇజ్రాయెల్ కలసి పనిచేశాయి. నాటి ఇరాన్ షా మొహమ్మద్ రెజా రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ భారీగా అయిల్ వనరులు పొందింది. అయితే, ఈ ప్రాజెక్టు 1979లో Iranian Revolution- 1979 కారణంగా అర్ధాంతరంగా ముగిసింది.