News July 3, 2024
రాష్ట్రంలో పవర్ కట్స్ లేవు: భట్టి

TG: రాష్ట్రంలో పవర్ కట్స్ లేవని, కేవలం విద్యుత్ అంతరాయాలు మాత్రమే ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్‌లోకి రమ్మని మేం అడగడం లేదు. కేసీఆర్ అన్యాయాన్ని అరికట్టాలని వారే వస్తున్నారు. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. పీసీసీ నియామక కసరత్తు మొదలైంది. ప్రజలు కోరుకుంటే కొండలు, గుట్టలకూ రైతు భరోసా ఇస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2026
సినిమా కథ రాసుకున్న రామ్.. డైరెక్టర్ కోసం వేట?

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత కొత్త ప్రాజెక్టు విషయంలో రామ్ పోతినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ మూవీలో పాట రాసిన ఆయన ఈసారి ఓ కథను తన కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీని ఫర్‌ఫెక్ట్‌గా తెరపై ఆవిష్కరించే డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గతంలో లోగి విఘ్నేశ్‌తో ఓ సినిమా దాదాపు ఖాయమవగా అనివార్య కారణాలతో ఆగిపోయినట్లు టాలీవుడ్ టాక్. మరి రామ్ చెప్పిన కథను తీసే దర్శకుడెవరో?
News April 18, 2026
రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.
News April 18, 2026
హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.


