News July 3, 2024

బుమ్రా భార్య పేరుతో ఫేక్ అకౌంట్.. వార్నింగ్ ఇచ్చిన సంజన

image

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ పేరుతో Xలో ఓ ఫేక్ అకౌంట్ సృష్టించారు. తన పేరుతో నకిలీ ఖాతా క్రియేట్ చేయడంతో సంజన మండిపడ్డారు. ‘నా కుటుంబం ఫొటోలు, సమాచారాన్ని ఎవరో దొంగిలించి అచ్చం నా అకౌంట్ లాగే మరో ఖాతా తెరిచారు. వెంటనే దీనిని తొలగించండి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె హెచ్చరించారు.

Similar News

News March 22, 2026

ఇండియాలో ఎక్కువ బ్రాంచులు ఉన్న బ్యాంకులు ఇవే

image

1. SBI- 23,085
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 10,228
3. కెనరా బ్యాంక్- 9,948
4. HDFC- 9,545
5. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8,655
6. బ్యాంక్ ఆఫ్ బరోడా- 8,424
7. ICICI- 7,246
8. యాక్సిస్ బ్యాంక్- 5,976
9. ఇండియన్ బ్యాంక్- 5,955 10. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 5,375

News March 22, 2026

PSL నుంచి IPLకు శనక

image

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) నుంచి శ్రీలంక T20 కెప్టెన్ దసున్ శనక తప్పుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. IPLలో RR తరఫున ఆయన ఆడే అవకాశముందని పేర్కొన్నాయి. గాయంతో దూరమైన సామ్ కరన్‌ను ఆయన రీప్లేస్ చేస్తారని సమాచారం. కాగా శనకను PSL వేలంలో లాహోర్ క్వాలెండర్స్ 2.2కోట్ల(PKR)కు కొనుగోలు చేసింది. ఇక ఆసీస్ ప్లేయర్ మాక్స్‌వెల్ సహా మరికొంతమంది ఆటగాళ్లు PSL నుంచి తప్పుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News March 22, 2026

కల్తీ పాలు.. 16కు చేరిన మరణాల సంఖ్య

image

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణాల సంఖ్య 16కు చేరింది. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావు(72) తాజాగా మృతి చెందారు. కల్తీ పాలు తాగడంతో ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు కొండబాబు(64) అనే వ్యక్తి మాత్రమే కోలుకున్నారు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్‌లో ఇథిలీన్ గ్లైకాల్ <<19323083>>కలవడంతోనే<<>> ఈ ఘోరం జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే.