News July 3, 2024
తొండూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పులివెందుల ముద్దనూరు ప్రధాన రహదారిలోని మడూరు బస్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కథను మేరకు కొండాపురం మండలం లావనూరుకి చెందిన వేణుగోపాల్ నాయుడు(36) పులివెందులకు బైకులో వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మడూరు సమీపంలోకి రాగానే సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. దీంతో ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేశారు.
Similar News
News March 1, 2026
కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు.!

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కడప రూ.288.12 కోట్లు, ప్రొద్దుటూరు రూ.185.50 కోట్లు, పులివెందుల రూ.126.07 కోట్లు, బద్వేల్ రూ.117.90 కోట్లు, మైదుకూరు రూ.101.80 కోట్లు, ఎర్రగుంట్ల రూ.80.91 కోట్లు, జమ్మలమడుగు రూ.77.01 కోట్లు, ముద్దనూరు రూ.42.97 కోట్లు, సిద్దవటం రూ.33.52 కోట్ల మద్యం విక్రయించారు.
News March 1, 2026
కడప జిల్లాలో కీలక పోస్టుల్లో ఇన్‌ఛార్జ్‌ల పాలన.!

కడపలో 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన జిల్లాలోని పలువురు అధికారులు హైకోర్టు ఆదేశాలతో GADలో రిపోర్ట్ చేశారు. కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్‌రెడ్డి స్థానంలో KMC కమిషనర్ రాకేశ్ చంద్రం, ప్రొద్దుటూరు RTO మనీషా స్థానంలో MVI నారాయణ నాయక్, జమ్మలమడుగు RDO శిరీషా స్థానంలో పులివెందుల RDO చిన్నయ్య, కడప RDO జాన్ స్థానంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావనకు అదనపు బాధ్యతలు(FAC) అప్పగించారు.
News February 28, 2026
పుష్పగిరి: ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరులు

వల్లూరు మండలం పుష్పగిరి సంతాన మల్లేశ్వర ఆలయం వద్ద ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరుని రూపాలు ఉండటం అత్యంత అరుదని చరిత్రకారుడు బి.రమేష్ తెలిపారు. అర్చకులు అఖిల్ స్వామి సమాచారంతో పరిశోధించిన ఆయన ఈ శిల్పం పశుత్వం నుంచి దైవత్వానికి మారడాన్ని సూచిస్తుందన్నారు. చారిత్రక దాడుల్లో నంది ముఖం ధ్వంసమైనా లింగధారినంది, అద్భుతమైన హారాలు, అర్ధ పద్మాసనంలో ఉన్న నందికేశ్వరుని శిల్పకళ విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.


