News July 3, 2024
కరీంనగర్ చరిత్రలో ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు కాలేదు: గంగుల

శాసనసభ్యులుగా ఎన్నికై ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రస్తావించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిన్న జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తితే క్రిమినల్ కేసులు పెట్టడం కరీంనగర్ జిల్లా చరిత్రలో లేదని పేర్కొన్నారు. సమస్యలను సభ దృష్టికి తీసుకువస్తే విధులకు ఆటంకం కలిగించినట్లు ఎలా అవుతుందని గంగుల ప్రశ్నించారు.
Similar News
News March 14, 2026
KNR: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. వినూత్న శిక్ష

కరీంనగర్‌లో మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన మంకమ్మతోటకు చెందిన టి.శేఖర్‌కు కోర్టు వినూత్న శిక్ష విధించింది. రూ.6 వేల జరిమానా చెల్లించకపోవడంతో, రెండో తరగతి ప్రత్యేక మేజిస్ట్రేట్ డాక్టర్ ఈదుల లక్ష్మి ఈ తీర్పునిచ్చారు. దీని ప్రకారం నిందితుడు మార్చి 13 నుంచి ఏడు రోజుల పాటు పోలీసుల పర్యవేక్షణలో సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
News March 13, 2026
KNR: అల్లరి మూకల అదుపుపై పోలీసులకు శిక్షణ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏఆర్, క్యూఆర్‌టీ బలగాలకు ‘మాబ్ ఆపరేషన్ డ్రిల్’ నిర్వహించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణలో సిబ్బందికి లాఠీఛార్జ్, స్మోక్ గన్, ‘వజ్ర’ వాహన వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. అల్లరి మూకలను వ్యూహాత్మకంగా అదుపు చేస్తూనే, స్వీయ రక్షణ పాటించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News March 13, 2026
కరీంనగర్ పీటీసీలో ఘనంగా దీక్షాంత పరేడ్

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో 99 మంది నూతన కానిస్టేబుళ్ల దీక్షాంత పరేడ్ ఘనంగా జరిగింది. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల నుంచి సీపీ గౌష్ ఆలం గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ చాటిన వారికి అవార్డులు అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీపీ పిలుపునిచ్చారు.


