News July 3, 2024

ఆందోల్: విద్యుదాఘాతంతో లైన్ మెన్ మృతి

image

విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం ఎర్రారంలో జరిగింది. స్థానికుల వివరాలు.. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటకు చెందిన లైన్ మెన్ చంద్రశేఖర్, మరో లైన్ మెన్ విద్యుత్ లైన్‌‌ను బాగు చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగగా చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

Similar News

News March 14, 2026

మెదక్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

image

మెదక్ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 68 కేంద్రాల్లో 11,247 మంది విద్యార్థులు (5,577 బాలురు, 5,670 బాలికలు) పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

News March 14, 2026

మహిళల సాధికారతకు ప్రభుత్వం కృషి: మంత్రి దామోదర

image

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ హాస్పిటల్‌లో ‘షి పవర్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విమెన్స్ కాంక్లేవ్’లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘షి పవర్ మొబైల్ యాప్’ను ఆయన ఆవిష్కరించారు. మహిళా సాధికారతపై జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో వివిధ రంగాల మహిళా నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

News March 14, 2026

మెదక్: ‘ఎస్సీలకు ఆర్థిక సాయం..17లోగా దరఖాస్తు చేసుకోండి’

image

మెదక్ జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ. 236.60 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి తెలిపారు. దీని ద్వారా 249 మందికి లబ్ధి కలగనుంది. ఇందులో 119 ఈవీ బైక్‌లు, 59 ఆటో రిక్షాలు, 12 వ్యవసాయ యూనిట్లు కేటాయించారు. ఆసక్తిగల వారు ఈ నెల 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.