News July 3, 2024
121 మంది మృతి.. స్పందించిన భోలేబాబా

హాథ్రస్ తొక్కిసలాటలో 121మంది మరణించడంపై భోలేబాబా స్పందించారు. ‘సత్సంగ్ నుంచి నేను వెళ్లిపోయిన చాలాసేపటికి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సామాజిక వ్యతిరేక శక్తులే కారణం. దీనివల్ల భారీ ప్రాణనష్టం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆ పరమాత్ముడిని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ఘటన జరిగినప్పటి నుంచి బాబా పరారీలో ఉన్నారు.
Similar News
News March 21, 2026
నల్గొండ రోడ్లకు ‘బడ్జెట్’ మొండిచేయి!

రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి. జిల్లాకు చెందిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, సొంత జిల్లా రహదారుల అభివృద్ధికి బడ్జెట్‌లో ఆశించిన ప్రాధాన్యత దక్కలేదు. అధ్వాన్నంగా ఉన్న చిట్యాల-భువనగిరి, నల్గొండ -కొండమల్లేపల్లి వంటి రహదారుల విస్తరణకు నిధుల ప్రస్తావన ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. జిల్లావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News March 21, 2026
తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్

TG: ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రకారం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2,3వ ప్లేస్‌లో HYD(రూ.4,76,679), సంగారెడ్డి(రూ.3,94,587) ఉన్నాయి. రూ.2,37,809 అత్యల్ప తలసరి ఆదాయంతో హనుమకొండ చివరి స్థానంలో ఉంది. కరవు ప్రాంతంగా ముద్రపడ్డ MBNR రూ.3,36,898తో ఆరో ప్లేస్‌కు చేరుకోవడం విశేషం. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందుండటం కొసమెరుపు.
News March 21, 2026
ధురంధర్-2 తెలుగు వెర్షన్ నేటి నుంచే..

ధురంధర్-2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్‌లు స్క్రీనింగ్ అవుతున్నాయి. కేవలం హిందీలోనే వచ్చిన పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో పార్ట్-2 గురించి తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా ధురంధర్-2ను తెలుగులోనూ విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నెల 19న మూవీ రిలీజైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాలేదు.


