News July 3, 2024
కావలిలో హోటల్ సీజ్ చేసిన అధికారులు

కావలి పట్టణంలోని ఓ డాబా హోటల్ లో బుధవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, తదితర తప్పిదాలను అధికారులు గుర్తించారు. రోజుల తరబడి మాంసం నిల్వ ఉండటంతో వెంటనే హోటల్‌ను సీజ్ చేసి గేట్లకు సీల్ వేశారు. వారు మాట్లాడుతూ.. హోటల్స్‌లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 18, 2026
కోవూరు: ఇల్లా.. నందనవనమా..?

కోవూరు మండలం పాటూరులో ఓ వ్యక్తి తన ఇంటిని పూల చెట్లతో నందనవనంలా మార్చాడు. తన మూడు అంతస్తుల ఇంటిని ఒక్కొక్క అంతస్తుకి ఒక అరలాగా కనిపించేలా కాగితాల పూల చెట్లను అల్లించాడు. దీంతో వేసవి కాలంలో ఆ ఇంట్లో చల్లదనం తోపాటు స్వచ్ఛమైన గాలి అందుతోంది. ఈ రంగు రంగుల కాగితాల పూలతో ఆ ఇల్లు అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలను ఆకట్టుకుంటోంది.
News March 17, 2026
నెల్లూరు జిల్లాకు 18 కొత్త మొబైల్ టవర్లు

నెల్లూరు జిల్లాలో నెట్‌వర్క్ లేని మారుమూల గ్రామాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలో 18 కొత్త మొబైల్ టవర్లు మంజూరైనట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో ఎంపీ చర్చించారు. దీంతో 2026 డిసెంబర్ నాటికి ఆత్మకూరు, కోవూరు, కందుకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ టవర్లను ఏర్పాటు చేయనున్నారు.
News March 17, 2026
అక్రమ కేసులకు భయపడం: కాకాణి

తప్పు చేసిన వారిని వదిలేసి, ప్రశ్నించే వారిని జైలుకు పంపుతారా? అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించారు. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి నేతలు చెప్పినట్లు అక్రమ అరెస్టులు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.


