News July 3, 2024

అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ ఔట్?

image

అమెరికా అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకోవాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. గత కొంతకాలంగా ఆయన ప్రవర్తన తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌తో జరిగిన తాజా డిబేట్‌లోనూ బైడెన్ తేలిపోయారు. దీంతో సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందని, తప్పుకోవడమే మేలని బైడెన్ భావిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ కథనాన్ని శ్వేతసౌధం ఖండించింది.

Similar News

News April 10, 2026

ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

image

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్‌ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.

News April 10, 2026

మోదీ హత్యకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్

image

ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలతో బిహార్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. తాను మోదీని 22 రోజుల్లో హతమారుస్తానని, భారీగా డబ్బు ఇవ్వాలంటూ అమెరికా నిఘా సంస్థ CIAకు అమన్ తివారీ ఈమెయిల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బక్సర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతని ఇద్దరు అనుచరులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

News April 10, 2026

భారతీయులకు పింక్ లిప్స్ ఎందుకు ఉండవంటే?

image

భారతీయులకు అమెరికన్లలా సహజంగా పింక్ లిప్స్ ఉండకపోవడానికి ప్రధాన కారణం ‘మెలనిన్’అని మాజీ AIIMS డెర్మటాలజిస్ట్ ఆంచల్ పంత్ వివరించారు. ‘మన చర్మం సూర్యరశ్మి నుంచి రక్షణ పొందేందుకు ఎక్కువ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పెదవులు గోధుమ, నలుపు రంగులో కనిపిస్తాయి. విదేశీయుల్లో మెలనిన్ తక్కువగా ఉండి రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి. అందుకే పెదవులు పింక్ కలర్‌లో ఉంటాయి. ఇది జన్యుపరమైన మార్పే’ అని తెలిపారు.