News July 3, 2024

అద్వానీకి మరోసారి అస్వస్థత

image

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే.అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సురి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ ఆరు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందించారు.

Similar News

News March 25, 2026

అమరావతిలో అగ్నిప్రమాదాలు.. దర్యాప్తు ముమ్మరం

image

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై పోలీసు శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తూ ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల L&T కంపెనీ, తాజాగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పైపులు దగ్ధమైన సంగతి తెలిసిందే. అయితే అవి 130 డిగ్రీల వేడికి తప్ప చిన్న మంటలకు దగ్ధం కావనేది నిపుణుల అభిప్రాయం. కాగా వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉండొచ్చని <<19466902>>CM అనుమానం<<>> వ్యక్తం చేశారు.

News March 25, 2026

ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

image

AP: రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ‘ఎల్‌ నినో’ కారణంగా ఈసారి ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే 2-4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. మరోవైపు ఈనెల 28 వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27,28 తేదీల్లో గంటకు 40-60kms వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం సహా పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

News March 25, 2026

డీలిమిటేషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది?

image

రాజ్యాంగం ప్రకారం పదేళ్లకోసారి <<19460921>>డీలిమిటేషన్<<>> (జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్ల పెంపు, నియోజకవర్గాల సరిహద్దుల సర్దుబాటు) చేపట్టాలి. గతంలో 1952, 1963, 1973లో చేపట్టారు. ఆ తర్వాత జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలకు నష్టం జరగొద్దని 25yrs నిలిపివేశారు. ఆ తర్వాత కూడా అవే పరిస్థితులు ఉండటంతో మరో 25yrs పొడిగించారు. 2002లో డీలిమిటేషన్ చేపట్టినా సీట్ల సంఖ్య పెంచకుండా నియోజకవర్గ పరిధులను మాత్రమే మార్చారు.